: భూసేకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతాం: అఖిలపక్షంతో స్పష్టం చేసిన ప్రధాని


పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో, ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల్లో భూసేకరణ బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరముందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు విపక్షాలపై కూడా ఉందని తెలిపారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News