: కేసీఆర్ లో నిజాం నవాబు పరకాయ ప్రవేశం చేశాడు: సీపీఐ నారాయణ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మండిపడ్డారు. కేసీఆర్ కు ఆంధ్ర ఫోబియా పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, కేసీఆర్ లో నిజాం నవాబు పరకాయ ప్రవేశం చేసినట్టున్నాడని... ఆయన పాలన నిజాంను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. మరోవైపు, ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి పుష్కరాల పేరుతో మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొస్తున్న భూసేకరణ బిల్లుపై చంద్రబాబు, కేసీఆర్ లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిపై రేపు హైదరాబాదులోని సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ చేస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News