: మణిపూర్ దాడి వెనుక చైనా హస్తం... వెలుగులోకి వచ్చిన పచ్చినిజం!


గత నెల 4వ తేదీన మణిపూర్ లో సైన్యంపై మిలిటెంట్లు దాడి చేసి 18 మంది భద్రతాదళ సిబ్బందిని బలితీసుకున్న ఘటన వెనుక చైనా ప్రమేయం ఉన్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని రెబల్ గ్రూపులకు చైనా ఆర్థిక సాయం చేస్తోందని, దాడికి జరిగిన కుట్ర వెనుక కూడా చైనా హస్తం ఉందని నిరూపించేందుకు మరిన్ని సాక్ష్యాలను సేకరించినట్టు తెలుస్తోంది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ - కాఫ్ లాంగ్ (ఎన్ఎస్ సీఎన్-కే) మిలిటెంట్లు జరిపిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. చైనా ఏర్పాటు చేసిన యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ వెస్ట్రన్ సౌతాసియా దళం చెప్పుచేతల్లో ఉన్న యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్) ప్రోద్బలంతోనే దాడి జరిగినట్టు నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం. అసోంలోని ఉల్ఫా మిలిటెంట్లు, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్-సోనబ్జిత్, మణిపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కేవైకేఎల్ తదితర మిలిటెంట్ సంస్థలను ఏకం చేసేందుకు చైనా నిధులను కేటాయిస్తున్నట్టు సాక్ష్యాలు లభించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News