: రాత్రంతా నిద్రపోని చంద్రబాబు!
గమ్యస్థానాలకు చేరలేక ఇబ్బందులు పడుతున్న పుష్కర యాత్రికులను చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చలించిపోయారు. గత రాత్రి 2:30 గంటల నుంచి 5 గంటల వరకూ రాజమండ్రి బస్టాండులోనే గడిపిన చంద్రబాబు బస్సులను నియంత్రించే అధికారులకు ఆదేశాలు ఇస్తూ, యాత్రికులను దగ్గరుండి బస్సులు ఎక్కిస్తూ గడిపారు. రాజమండ్రిలో యాత్రికుల రద్దీ కొనసాగుతుండడంతో తనకు నిద్రపట్టలేదని, వారిని సురక్షితంగా సొంత ప్రదేశాలకు పంపేందుకే తాను వచ్చానని ఈ సందర్భంగా బాబు వ్యాఖ్యానించారు. పుష్కరాలు ఇంకా ఆరు రోజుల పాటు సాగుతాయని గుర్తు చేసిన ఆయన, ఎవరికి వీలున్న రోజున వారు రావాలని పిలుపునిచ్చారు.