: ప్రతి కుటుంబమూ ఒక బిందె నీరు తమది కాదనుకోవాలి: చంద్రబాబు


రాజమండ్రి నుంచి నరసాపురం వరకూ గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇంట్లో ఒక బిందె మంచినీరు తమది కాదనుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులను బంధువుల మాదిరిగా భావించి, వారికి ఆతిథ్యం ఇవ్వాలని, వారికి గ్లాసుడు మంచినీరిచ్చి దాహం తీర్చాలని విజ్ఞప్తి చేశారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులూ రాకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసం అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని ఆయన అన్నారు. అంచనాలకు మించి యాత్రికులు రావడం వల్లనే కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News