: తండ్రయిన టీమిండియా పేసర్


టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి తండ్రయ్యాడు. షమి అర్ధాంగి హసీన్ జహాన్ శుక్రవారం మధ్యాహ్నం కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమమేనని షమి మీడియాకు తెలిపాడు. పవిత్ర రంజాన్ కు ముందురోజు తమ ఇంట బిడ్డ పుట్టడంతో షమి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. షమి గాయం కారణంగా టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఎడమ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ పేసర్ వేగంగా కోలుకుంటున్నట్టు తెలిపాడు. లంక టూర్ కు షమి ఎంపిక కాకపోవచ్చని, దక్షిణాఫ్రికాతో భారత్ లో జరిగే సిరీస్ కు అందుబాటులో ఉంటాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News