: ఎన్ని నీళ్లయినా ఇవ్వగలిగే సామర్థ్యం ఒక్క గోదావరికే ఉంది: చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్ని నీళ్లయినా ఇవ్వగలిగే సామర్థ్యం ఒక్క గోదావరి నదికే ఉందని అన్నారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నట్టు తెలిపారు. నీటిని సమర్థంగా వినియోగిస్తే కరవు ఉండదని వివరించారు. నదుల అనుసంధానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, పట్టిసీమ, తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి లక్షా 20 వేల ఎకరాలకు నీరు అందిస్తామని వివరించారు. నీరు ఉంటే జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, నీరు ఉంటే రైతులు బంగారం పండిస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతుల భాగస్వామ్యం లేనిదే ఏ పనీ సజావుగా సాగదని అన్నారు. వ్యవసాయం లాభసాటి అయ్యేంతవరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News