: హైదరాబాద్ లో వెంకయ్యనాయుడు ఇంటి ముందు టి.లాయర్ల ఆందోళన


హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంటి ముందు తెలంగాణ న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. తక్షణమే హైకోర్టు విభజన చేపట్టాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయస్థానాలు వేరువేరుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళనతో స్పందించిన వెంకయ్య, విభజన బిల్లులో పొందుపరిచిన విధంగా రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. న్యాయశాఖ మంత్రితో మాట్లాడి ఉమ్మడి హైకోర్టును విభజించే ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News