: ఆసీస్ క్రికెటర్ ఇంటికి సమీపంలో బాంబు లభ్యం!


ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ బ్రాడ్ హాడిన్ నివాసానికి సమీపంలో ఐఈడీ (ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్) లభ్యమైందని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. సిడ్నీలోని హాడిన్ నివాసానికి సమీపంలో రోడ్డుపై ఉన్న గడ్డిలో ఈ బాంబును గుర్తించిన పోలీసు అధికారులు, అనంతరం దాన్ని తొలగించారు. బ్యూటేన్ తో కూడిన రెండు డబ్బాలకు ఓ వత్తిని అనుసంధానించారని పోలీసు వర్గాలు తెలిపాయి. దాన్ని పేల్చేందుకు ప్రయత్నం జరిగినట్టు అక్కడి ఆధారాలను బట్టి అంచనాకు వచ్చారు. దీనిపై లోతుగా పరిశోధిస్తున్నారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పందించింది. ప్రస్తుతం హాడిన్ తన కుటుంబంతో ఇంగ్లాండ్ లో ఉన్నాడని సీఏ ప్రతినిధి తెలిపారు.

  • Loading...

More Telugu News