: ముస్లిం సోదరులకు ప్రముఖుల రంజాన్ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ నేటి ఉదయం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు, నారాయణ తదతరులు కూడా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.