: బైక్ ఎక్కిన మంత్రి నారాయణ... రాజమండ్రిలో పుష్కర ఘాట్ల పరిశీలన
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ బైక్ ఎక్కారు. పుష్కర ఏర్పాట్లను అంతా తానై పూర్తి చేయించిన నారాయణ... భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులు తదితరాలపై దృష్టి సారించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నేటి ఉదయం ఆయన బైక్ పై ప్రత్యక్షమయ్యారు. బైక్ పై తిరుగుతూనే ఆయన పుష్కర ఘాట్లను పరిశీలించారు. రద్దీ నెలకొన్న ప్రాంతాల్లో కాసేపు ఆగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవసరమైన చోట్ల సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.