: ప్రత్యూష యోగక్షేమాలు నేనే చూసుకుంటా: టీఎస్ సీఎం కేసీఆర్ ప్రకటన
తండ్రి, పినతల్లి చేతిలో నరకాన్ని చవిచూసిన బాలిక ప్రత్యూషకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రత్యూషకు సాయం చేసేందుకు సిద్ధమని టీడీపీ యువనేత నారా లోకేశ్ సంసిద్ధత వ్యక్తం చేయగా, తాజాగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ముందుకొచ్చారు. ప్రత్యూష యోగక్షేమాలు ఇక తానే చూసుకుంటానంటూ ఆయన ప్రకటించారు. అంతేకాక తీవ్ర గాయాలైన నేపథ్యంలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను పరామర్శించేందుకు కుటుంబసమేతంగా నేడు ఆస్పత్రికి వెళ్లనున్నారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.