: షాహిద్ మంచి భర్తగా మీరాను మెప్పించగలడు: మాజీ ప్రేయసి భరోసా
షాహిద్ కపూర్ మంచి భర్తగా మీరా రాజ్ పుత్ కపూర్ ను మెప్పించగలడని అతని మాజీ ప్రేయసి కరీనా కపూర్ ఖాన్ తెలిపింది. షాహిద్ వివాహానికి, రిసెప్షన్ కు కూడా హాజరుకాని కరీనా దంపతులు కొత్త జంటకు కానుకివ్వాలని భావిస్తున్నారట. ఈ విషయమై కరీనాను మీడియా ప్రశ్నించగా, షాహిద్ నటుడిగా నిరూపించుకున్నాడని చెప్పింది. వివాహ సమయం వచ్చింది కనుక వివాహం చేసుకున్నాడని పేర్కొంది. షాహిద్ ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోడని చెప్పింది. షాహిద్ కు వివాహమైనందుకు చాలా సంతోషంగా ఉందని కరీనా పేర్కొంది. మంచి భర్తగా మీరాను షాహిద్ మెప్పించగలడని, ఎందుకంటే అతను మంచి వ్యక్తి అని కరీనా కితాబిచ్చింది. కానీ తామిచ్చే కానుక ఏంటన్నది మాత్రం చెప్పలేదు.