: హిందూ, ముస్లిం పండగల నేపథ్యంలో అహ్మదాబాద్ లో భారీ భద్రత
అహ్మదాబాద్ పోలీసులకు పెను సవాల్ ఎదురుకానుంది. హిందువులకు పవిత్రమైన 138వ పూరీ జగన్నాథ రథయాత్ర, ముస్లింల పవిత్ర రంజాన్ పండగ రేపు ఒకేరోజున వచ్చాయి. 30 ఏళ్ల తరువాత రెండు పండగలు ఒకేరోజున రావడంతో అహ్మదాబాద్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ లో 400 ఏళ్ల చరిత్ర కలిగిన జమల్ పూర్ ఆలయం నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుండగా, ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. పూరీ జగన్నాథ రథయాత్రను ముఖ్యమంత్రి అనందీ బెన్ పటేల్ ప్రారంభించనున్నారు. లక్ష మంది పాల్గొనే ఈ యాత్ర 14 కిలోమీటర్ల మేర సాగనుంది. అహ్మదాబాద్ మొత్తాన్ని పోలీసులు పహారా కాస్తున్నారు. అనుమానాస్పద, సున్నితమైన ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు.