: సమ్మె వెనుక ఆంధ్రా పార్టీల హస్తముంది: కేసీఆర్


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె వెనుక ఆంధ్రా పార్టీల హస్తముందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. జీతాలు పెంచిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపేందుకు సమ్మె విరమించిన పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు ఈ మధ్యాహ్నం సీఎంను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి మరిన్ని వరాలు ప్రకటించారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగే కొద్దీ కార్మికుల జీతాలు పెంచుతామన్నారు. హైదరాబాద్ నగరం మధ్యలో మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని, వారి పిల్లలకు చదువుకు సాయం చేస్తామని, ఆరోగ్య సేవలు కూడా మెరుగుపరుస్తామని సీఎం హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News