: అయినవాళ్లే వేధించడం బాధాకరం... ప్రత్యూషకు వ్యక్తిగతంగానూ సాయపడతా: నారా లోకేశ్
సవతి తల్లి హింస కారణంగా ఆసుపత్రి పాలైన ప్రత్యూష దీనగాథ అందరినీ కదిలిస్తోంది. ఇప్పటికే రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఆ బాలిక బాధ్యతలు తాను స్వీకరిస్తానని ముందుకు రావడం తెలిసిందే. తాజాగా, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ కూడా స్పందించారు. ప్రత్యూషకు తమ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపునే కాకుండా, వ్యక్తిగతంగానూ సాయపడతానని తెలిపారు. అయినవాళ్లే ఆమెను వేధించడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, లోకేశ్ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. లోకేశ్ మంచి నిర్ణయం తీసుకున్నారని చాలామంది ప్రశంసించారు.