: బస్సులో నుంచి దూకిన మహిళా కండక్టర్ మృతి


పశ్చిమగోదావరి జిల్లాలో బస్సులో నుంచి భయంతో దూకేసిన మహిళా కండక్టర్ పద్మావతి చనిపోయింది. తీవ్ర గాయాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె మరణించినట్టు తెలిసింది. ఈ రోజు జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమ వెళుతున్న బస్సును మధ్యలో ఆపిన ఆర్టీసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో కండక్టర్ ఇచ్చిన టికెట్లకన్నా బస్సులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందని గుర్తించారు. దాంతో చార్టులో రిమార్కులు రాయడంతో మనస్తాపానికి గురైన కండక్టర్ నడస్తున్న బస్సులో నుంచి దూకేసింది. దాంతో ఆమెకు తీవ్రంగా గాయాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News