: పాలమూరు ప్రాజెక్టుపై రాజ్యసభకు సీఎం రమేష్ లేఖ... మండిపడుతున్న టీఆర్ఎస్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై తాజాగా సీఎం రమేష్ రాజ్యసభకు లేఖ రాశారని టీఆర్ఎస్ వెల్లడించింది. ఆ ప్రాజెక్ట్ అనుమతిలేని ప్రాజెక్ట్ అని రాశారని తెలిపింది. 'ఎలాంటి అనుమతుల్లేని ప్రాజెక్టు పనుల విషయం కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి వచ్చిందా? ఆమోదంలేని ప్రాజెక్టును నిలిపివేయడానికి జలవనరుల శాఖ తీసుకున్న చర్యలేంటి?' అంటూ రమేష్ ప్రశ్నించినట్టు వివరించింది. అంతకుముందు కేంద్ర జల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాసిన తరువాత మళ్లీ ఆ పార్టీ ఎంపీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖ రాయడంపై టీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. ఓవైపు ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదంటూనే మరోవైపు లేఖలతో ప్రాజెక్టుపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది.