: 'బాహుబలి'ని ఆదుకునేందుకు రంగంలోకి దిగిన కోర్టు


పైరసీ భూతం నుంచి 'బాహుబలి'ని కాపాడేందుకు కోర్టు స్వయంగా రంగంలోకి దిగి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రాన్ని పైరసీ చేయకుండా ఆదేశించాలంటూ వెంకటేష్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైదరాబాదు అడిషనల్ చీఫ్ జడ్జి జీవీఎన్ భరత లక్ష్మి పలు ఆదేశాలు ఇచ్చారు. టెలికం సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, భారతీ ఎయిర్ టెల్, ఐడియా వంటి మొబైల్ మాధ్యమ ఆన్ లైన్ సేవలందిస్తున్న కంపెనీలకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ తదితర ఏ అంశాలనూ అప్ లోడ్ చేయాలని చూసినా, డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించినా, వాటిని అడ్డుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఇప్పటికే ఏవైనా వీడియోలు ఉంటే వాటిని బ్లాక్ చేయాలని, వీలైతే పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. ఈ చిత్రం పైరసీ పలు చోట్ల ప్రత్యక్షం అవుతుండడంతో చిత్ర నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News