: ఏపీలో ఇంతవరకు 60 లక్షల మంది పుష్కర స్నానాలు


ఆంధ్రప్రదేశ్ లో గోదావరి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 14 నుంచి మొదలైన పుష్కరాల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారు. ఈ నాలుగురోజుల్లోనే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని పుష్కర ఘాట్ లలో కలిపి దాదాపు 60 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి సెలవుల కారణంగా భక్తులు మరింత ఎక్కువమంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఇప్పటినుంచే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు గోదావరిలో ఈరోజు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సినీ నటి హేమ తదితరులు పుష్కర స్నానం ఆచరించారు.

  • Loading...

More Telugu News