: ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో బిజీగా ప.గో. కలెక్టర్
పుష్కరాలకు వచ్చిన భక్తులు, వారిని తీసుకొచ్చిన వాహనాలతో రాజమండ్రి రహదారులు ఇసుకేస్తే రాలనంతగా నిండిపోగా, ట్రాఫిక్ జాం సమస్యను నిలువరించేందుకు స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషను ప్రాంతంలో బస్సులు, ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్ జాం కావడంతో ఆ పక్కనే ఉండి సమస్యను గమనించిన ఆయన ట్రాఫిక్ కంట్రోలర్ అవతారమెత్తి రోడ్డుపై నిలబడి వాహనాల రాకపోకలను సరిదిద్దారు. కలెక్టర్ అలా నడిరోడ్డుపై నిలవడంతో పోలీసులు, ఇతర అధికారులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.