: టీ20 వరల్డ్ కప్ కమిటీలో తెలుగోడిదే కీలక భూమిక!
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ భారత్ లోనే జరగనుంది. బీసీసీఐ ఈ టోర్నీని నిర్వహించనుంది. ఈ మెగా టోర్నీ నిర్వహణలో తెలుగు నేలకు చెందిన వ్యక్తి కీలక భూమిక పోషించనున్నారు. టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీలో క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ గా తెలుగు వ్యక్తి ఎంవీ శ్రీధర్ నియమితులయ్యారు. ఇక ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ ను భద్రత, అవినీతి నిరోధక విభాగం ముఖ్య సలహాదారుగా బీసీసీఐ నియమించింది. టోర్నమెంట్ మేనేజర్ గా ఆర్పీ షా వ్యవహరించనుండగా, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ గా కేపీ రావు, టోర్నమెంట్ మీడియా మేనేజర్ గా నిషాంత్ జీత్ అరోరా, లాజిస్టిక్స్ అండ్ హాస్పిటాలిటీ మేనేజర్ గామయాంక్ పరీఖ్, కమిటీ సలహాదారుగా రత్నాకర్ శెట్టి నియమితులయ్యారు.