: పుష్కర యాత్రికులకు సేవలందించాలంటూ స్వచ్ఛంద సంస్థలకు చంద్రబాబు పిలుపు
గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు భోజనం, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. రాజమండ్రిలోనే ఉండి నిరంతరం పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న చంద్రబాబు... ఈ రోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలన్నీ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా సీఎం విజ్ఞప్తి చేశారు.