: ఇవే చర్యలు ముందే తీసుకుని ఉంటే... అంత ఘోరం జరిగేది కాదు: జ్యోతుల నెహ్రూ
పుష్కర ఏర్పాట్లలో అధికారుల వైఖరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న విధంగా ఉందని వైకాపా నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ముందే తీసుకుని ఉంటే, 27 మంది చనిపోయేవారు కాదని అన్నారు. పుష్కరాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన ముద్ర వేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారని నెహ్రూ తెలిపారు. ఈరోజు ఆయన రాజమండ్రిలో తన కుటుంబ సభ్యులతో కలసి పుష్కరస్నానం ఆచరించారు. మరోవైపు, పుష్కరాలకు వస్తున్న భక్తులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.