: ఏపీకి వరల్డ్ బ్యాంక్ రుణ సాయం... రూ.1500 కోట్లకు పైగా ఇచ్చేందుకు ఒప్పందం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రుణ సాయం చేసేందుకు ప్రపంచబ్యాంకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో విపత్తు పునరుద్ధరణ పనులకుగానూ 250 మిలియన్ డాలర్లు (రూ.1500 కోట్లకు పైగా) అప్పుగా ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఏపీలో ఏర్పడే విపత్తుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాల పెంపుకు, ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ నిధులను వినియోగిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు నేరుగా ఈ లబ్ధి పొందనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ జిల్లాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటం, రహదారుల పునరుద్ధరణ మొదలైన కార్యక్రమాలను అమలు చేస్తారు. ఐదేళ్ల కాలంలో ఏపీ ప్రభుత్వం ఈ పనులు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచబ్యాంకు మధ్య ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో జరిగిన సమావేశంలో కేంద్రం తరపున ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సెల్వకుమార్, బ్యాంకు తరపు భారతదేశ డైరెక్టర్ ఒన్నో రుల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంపై ఏపీ తరపున భూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్ చందర్ శర్మ సంతకం చేశారు.

  • Loading...

More Telugu News