: గోదావరిలో ఈత కొట్టిన తెలంగాణ మంత్రి!
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిన్న గోదావరిలో ఈత కొట్టారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం, బాసర, ధర్మపురిల్లో త్వరలో పర్యటించనున్నారు. దాంతో ఆయా ప్రాంతాల్లో జరిగిన ఏర్పాట్లను నిన్న ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ఘాట్ వద్ద గోదావరి నదిలోకి దిగిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నీటిలో కాసేపు ఈత కొట్టారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు మంత్రిగారి ఈత సరదాను తమ కెమెరాల్లో బంధించేశారు.