: పెళ్లి గురించి ఎవరూ బలవంతం చేయలేదు: సల్మాన్


'పెళ్లి చేసుకో' అంటూ తన కుటుంబ సభ్యులెవరూ బలవంతం చేయరని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలిపాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్లూభాయ్ తన పెళ్లి గురించి మరోసారి మాట్లాడాడు. పెళ్లికి తొందరేంలేదని అన్నాడు. ఈ మధ్యే షాహిద్ కపూర్ వివాహం సందర్భంగా మాట్లాడుతూ, ప్రేమ వివాహాలు జరగనప్పుడు, పెధ్దలు చూసిన సంబంధమైతే పెళ్లి చేసుకోవచ్చని పేర్కొన్నాడు. పనిలో పనిగా తనకు పెద్దలు సంబంధం చూస్తే చేసుకుంటానని సెలవిచ్చాడు. ఇంట్లో వాళ్లు వెంటనే సంబంధం తెచ్చారో లేక సంబంధం చూస్తామన్నారో కానీ, మరుసటి రోజే పెళ్లికి తొందరేం లేదని అన్నాడు. పెళ్లి గురించి మీ ఇంట్లో ఎవరు తొందర పెడుతున్నారంటూ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తన కుటుంబ సభ్యులెవరూ పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయరని అన్నాడు. కాగా, 49 ఏళ్ల సల్మాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా? అని అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News