: తెలంగాణ ఉద్యోగుల కోసం ఉద్యమానికి సైతం వెనకాడం: కోదండరాం


తెలుగు రాష్ట్రాల ఉద్యోగుల విభజన అంశానికి సంబంధించి టీ.ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ కోదండరాం, దేవీప్రసాద్, రవీందర్ రెడ్డిలు ఈ రోజు కమల్ నాథన్ కమిటీని కలిశారు. విభజనకు సంబంధించి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఏపీలో ఉన్న తెలంగాణ స్థానికత కలిగిన 121 మంది ఉద్యోగులను తక్షణమే రిలీవ్ చేయాలని కమల్ నాథన్ ను కోరారు. ఏపీలో ఉన్న టీ.ఉద్యోగుల కోసం ఉద్యమానికి కూడా వెనకాడబోమని మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వంతో చర్చిస్తామని కోదండరాం చెప్పారు. ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణలోనే ఉండాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోందని దేవీ ప్రసాద్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News