: 'బాహుబలి' ఇంటర్నేషనల్ వర్షన్ కు హాలీవుడ్ ఎడిటర్


అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'బాహుబలి' చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని నగరాల్లో ఈ సినిమా ఆడుతోంది. కొత్తగా ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ వర్షన్ ఒకటి సిద్ధం చేయించబోతున్నారు నిర్మాత శోభు యార్లగడ్డ. దానికోసం ప్రముఖ హాలీవుడ్ సినిమాల ఎడిటర్ విన్సెంట్ టబైలాన్ ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఎడిటింగ్ తరువాత కొత్త వర్షన్ ఆగస్టు చివరకల్లా సిద్ధం కానుందని తెలిపారు. 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్', 'టేకెన్ 2', 'నౌ యూ సీ మీ', 'ద లెజెండ్ ఆఫ్ హెర్క్యులస్' వంటి పలు చిత్రాలకు విన్సెంట్ ఎడిటర్ గా పనిచేశారు.

  • Loading...

More Telugu News