: బంధువుల ఇంటికి వెళ్లను... ఎవరైనా నన్ను ఆదుకోరూ... ప్లీజ్!: ప్రత్యూష


నొప్పి కలిగితే "అమ్మా" అని అంటాం! కఠిన శిలలను సైతం ఆ పిలుపు కరిగిస్తుందంటారు! ఆ కర్కోటకుల పైశాచికత్వానికి ఆ బాలిక ఎన్నిసార్లు "అమ్మా" అని దీనంగా పలవరించినా వారిలో కాఠిన్యం కరగలేదు సరికదా, మరింత క్రూరత్వం సంతరించుకున్నారు. లేత శరీరంపై వాతలు, వాటిపై యాసిడ్ చల్లడం, రాళ్ల దెబ్బలు... బయటికి చెప్పుకోలేని రీతిలో సాగిందా రాక్షసకాండ! ఈ చిత్రవధ భరించేందుకా బతికున్నది అని లోకంపోకడ తెలియని ఆ అమ్మాయి అనుకోని క్షణం లేదు! హైదరాబాదులో... తల్లి లోకాన్ని విడిచిపోగా, ఆస్తి కోసం కన్నతండ్రి, సవతి తల్లే ఆ బాలిక పాలిట రాక్షసులు కాగా, వారి చిత్రహింసలకు గురైన అభాగ్యురాలు ప్రత్యూష దీనగాథే ఇది. అయితే, బాలల హక్కుల సంఘాల చొరవతో నరకకూపం నుంచి బయటపడిన ప్రత్యూష ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ... తండ్రి రమేశ్ ను, సవతి తల్లి శ్యామలను కఠినంగా శిక్షించాలని కోరింది. వారు మనుషులు కారని, నరరూప రాక్షసులని వారిపట్ల తనలో పేరుకుపోయిన అసహ్యాన్ని వెళ్లగక్కింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బంధువుల ఇంటికి వెళ్లనని, తాను ఇంతకుముందు ఉన్న అనాథ ఆశ్రమానికే వెళ్లిపోతానని చెప్పింది. ఇప్పటికే నర్సింగ్ పూర్తిచేశానని, ఎవరైనా దాతలు సాయం చేస్తే వైద్య విద్య అభ్యసిస్తానని తెలిపింది. దయతో దాతలు ఆదుకోవాలని కోరింది.

  • Loading...

More Telugu News