: ఫోటోల్లో మరింత స్లిమ్ గా కనిపించాలా? ఇలా చేయండి!


ఓ గ్రూప్ ఫోటో తీసేందుకు మీ మిత్రులు సన్నద్ధమవుతున్న వేళ, స్నేహితుల వెనకాల నిలుచుని ఉంటారా? లావుగా కనిపిస్తామేమోనన్న భయం మీలో ఉందా? ఫోటోల్లో మరింత స్లిమ్ గా కనిపించేందుకు కొన్ని చిట్కాలు... కెమెరాకు ఎదురుగా ఎప్పుడూ నిలుచోవద్దు: మీ కాళ్లను కొద్దిగా పక్కకు తిప్పి, నడుము పై భాగాన్ని ఫోటోగ్రాఫర్ వైపు తిప్పడం ద్వారా, తీసే చిత్రాల్లో లావుగా ఉన్న భాగాలు సన్నగా కనిపిస్తాయి. ధరించిన దుస్తులపైనా శ్రద్ధ పెట్టాలి: ఒకవేళ మీరు లోదుస్తులు ధరించి సన్ బాత్ లేదా స్విమ్మింగ్ పూల్స్ వద్ద ఉన్న సమయంలో ఫోటోలు తీయించుకోవాల్సి వస్తే, శరీరాన్ని చుట్టి ఉంచే సరోంగ్ వంటివి ధరిస్తే మేలు. నిటారుగా నిలుచుంటే మరింత నాజూకుదనం: కెమెరా ముందు నిటారుగా నిలుచుని, లావుగా కనిపించే ఉదర భాగాన్ని లోపలికి లాగడం, భుజాలను వెనక్కు పెట్టడం ద్వారా ఫోటోల్లో సన్నగా కనిపించవచ్చు. దీంతో పాటు చేతులను శరీరానికి ఆనుకొని ఉంచకుండా, కాస్తంత దూరంగా పెడితే మంచిది. కెమెరావైపే చూడాలి: ఫోటోలు తీసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలను ముందుకు వంచకూడదు. కెమెరా లెన్స్ వైపే కళ్లను ఉంచడం ద్వారా 'డబుల్ చిన్' సమస్యను తప్పించుకోవచ్చు. వెన్నెముక నిటారుగా ఉంచాలి: పాదాల నుంచి వెన్నెముక వరకూ నిటారుగా ఉంచి తలపై ఉన్న కిరీటాన్ని ఎవరో లాగేస్తున్నారన్న ఆలోచనతో తలను కూడా నిటారుగా ఉంచితే, మీరిచ్చే ఫోజు పదికాలాలు నిలుస్తుంది. కాళ్లు మడత పెట్టకూడదు: ఓ కాలు ముందు మరో కాలును పెట్టి ఫోటోలు దిగడం ద్వారా సన్నగా ఉన్న భాగాలు సైతం లావుగా కనిపిస్తాయి. రెండు కాళ్లూ నిటారుగా నేలపై ఉంచడం లేదా ఓ కాలుపై బరువుమోపుతూ ఇచ్చే ఫోజులు మంచి దృశ్యాలను అందిస్తాయి. దీంతో పాటు తెచ్చిపెట్టుకున్న నవ్వు కాకుండా సహజ చిరునవ్వు చిత్రానికి మరింత ప్రాణాన్ని ఇస్తుంది. ఒకడుగు వెనకుంటే మరింత సన్నం: ఓ గ్రూప్ ఫోటో దిగేముందు అందరూ వరుసగా నిలబడితే, మిగతావారితో పోలిస్తే ఒకడుగు వెనకుండడం ద్వారా కూడా సన్నగా కనిపించవచ్చు. ముందున్నవారి శరీరాలు పెద్దగా కనిపిస్తాయి కాబట్టి. ఈ టిప్స్ పాటిస్తే మరింత అందంగా, ఆకర్షణీయంగా ఫోటోలు దిగవచ్చు మరి.

  • Loading...

More Telugu News