: రఘువీరా భవితవ్యంపై జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం!


కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు(ఏపీసీసీ చీఫ్) రఘువీరారెడ్డి భవిష్యత్తుపై అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. గోదావరి పుష్కరాల్లో ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనపై విచారం వ్యక్తం చేయాల్సిందిపోయి, విమర్శలు గుప్పిస్తున్నారంటూ రఘువీరాపై అంతెత్తున ఎగిరిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష (పీసీసీ చీఫ్) పదవి ఉన్నంతకాలం మాత్రమే రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పదవి ఊడిన మరుక్షణం రఘువీరా వైసీపీకి వెళ్లడం ఖాయమని జేసీ జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News