: ప్రముఖ గాయకుడు రామకృష్ణ ఇకలేరు!
ప్రముఖ నేపథ్య గాయకుడు విస్సంరాజు రామకృష్ణ నేటి తెల్లవారుజామున మృతి చెందారు. తెలుగు చలనచిత్ర రంగంలో అలనాటి గాయకుడిగా రామకృష్ణకు విశేష గుర్తింపు ఉంది. ప్రముఖ గాయని పి. సుశీలకు సమీప బంధువైన రామకృష్ణ దాదాపుగా 5 వేలకు పైగా భక్తి గీతాలను ఆలపించారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న రామకృష్ణ నేటి తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లోని తన సొంతింటిలోనే తుదిశ్వాస విడిచారు. పలు చిత్రాల్లో హీరోగా నటించిన ‘నువ్వే కావాలి’ ఫేమ్ సాయి కిరణ్... రామకృష్ణ కుమారుడే.