: ఒబామా, మిషెల్ ల ప్రేమ కథ ఆధారంగా సినిమా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా ప్రేమ కథ ఆధారంగా సినిమా రూపుదిద్దుకోనుంది. రిచర్డ్ టానే అనే దర్శకుడు సొంతంగా తయారు చేసిన 'సౌత్ విత్ యూ' కథతో ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఒబామా పాత్రలో పార్కర్ సాయర్ కనిపించనుండగా, మిషెల్ పాత్రలో టికా సంప్టర్ నటిస్తున్నారు. వీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్న ఫోటోను రిచర్డ్ టానే సోషల్ మీడియాలో పెట్టగా, దానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఒబామా, మిషెల్ వయసులో ఉండగా ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉన్నారంటూ ఈ జంటకు ప్రశంసలు లభిస్తున్నాయి.