: కీలక సమావేశానికి 14 రాష్ట్రాల సీఎంలు డుమ్మా
అత్యంత కీలకమైన నీతి అయోగ్ సమావేశం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. అయితే, ఈ సమావేశానికి ఏకంగా 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత సీఎంలతో పాటు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు హాజరు కాలేదు. వివాదాస్పద భూసేకరణ బిల్లుపై చర్చించనుండటంతో వీరంతా గైర్హాజరయ్యారు. పుష్కరాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లలేదు.