: కేజ్రీవాల్ విజ్ఞప్తికి ప్రజలు స్పందిస్తున్నారు!


'పార్టీని నడపలేకున్నాం, నిధులు అందించండి' అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తి పట్ల ప్రజల్లో స్పందన మొదలైంది. మంగళవారం సాయంత్రానికి 537 మంది దాతలు స్పందించారని, తద్వారా 6,75,783 రూపాయలు విరాళాల రూపంలో అందాయని పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో మరిన్ని విరాళాలు అందుతాయని ఆప్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు సోమవారం నాడు ఓ ప్రకటనలో, పార్టీ రోజువారీ కార్యకలాపాలకు కూడా డబ్బుల్లేవని కేజ్రీవాల్ వాపోయారు. విరాళాలు అందించిన ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు. అక్రమ మార్గాల్లో నిధులు అందుకునే వీలున్నా, తాము అలాంటి మార్గాల్లో పయనించబోమని అన్నారు.

  • Loading...

More Telugu News