: షారుఖ్ తో గొప్ప స్నేహమేమీ లేదు... అలాగని శత్రువూ కాదు: అజయ్ దేవగణ్


ఇటీవల బల్గేరియాలో బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ రెస్టారెంట్లో ఒకే టేబుల్ వద్ద కూర్చుని విందు చేసుకోవడంపై మీడియా ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. దాంతో, వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై అజయ్ వివరణ ఇచ్చాడు. తామిద్దరి మధ్య గొప్ప స్నేహం అంటూ ఏమీ లేదని, అలాగని తాము పరస్పరం శత్రువులమూ కాదని అన్నారు. షారుఖ్ ను ఓ సహచర నటుడిగానే చూస్తానని, అంతకుమించిన సాన్నిహిత్యం తమ మధ్య లేదని తెలిపారు. రాసుకుని పూసుకుని తిరిగేంత స్నేహితులం కాదని అన్నారు. తప్పక పంచుకోవాల్సిన అంశాలేవీ తమ మధ్య లేవని చెప్పుకొచ్చారు. బల్గేరియాలో షారుఖ్ కొత్త చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా, అజయ్ అక్కడికి వెళ్లడం తెలిసిందే. దానిపై వెంటనే అజయ్ వివరణ ఇచ్చారు కూడా. ముందుగా ప్లాన్ చేసుకుని ఏమీ అక్కడికి వెళ్లలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News