: మీడియాకు పుస్తకం చూపించిన భత్కల్... అప్రమత్తమైన పోలీసులు


దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను ఇవాళ రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, తన చేతిలో ఉన్న ఓ పుస్తకాన్ని మీడియాకు భత్కల్ చూపించాడు. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు భత్కల్ నుంచి పుస్తకాన్ని లాగేసుకున్నారు. పుస్తకంలో ఏముందనే విషయంపై ఆరాతీస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కోర్టుకు హాజరైనప్పుడు చేతిలో పువ్వుతో భత్కల్ కనిపించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి పారిపోయేందుకు భత్కల్ కుట్ర చేస్తున్నాడనే వార్తల నేపథ్యంలో, పోలీసులు అలర్ట్ గా ఉంటున్నారు.

  • Loading...

More Telugu News