: అర్ధాంగి పోలీసు యూనిఫాం ధరించి చిక్కుల్లో పడిన ఐఏఎస్ అధికారి


సోషల్ మీడియా వెర్రి ఓ ఐఏఎస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. కేరళలోని ఎర్నాకులం జిల్లాకు ఎం.సి.రాజమాణిక్యం కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య నిషాంతిని ఐపీఎస్ అధికారి. ఆమె త్రిసూర్ జిల్లా పోలీస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, రాజమాణిక్యం తన భార్యకు చెందిన పోలీసు యూనిఫాంను ధరించి ఓ ఫొటో దిగారు. ఆ ఫొటోలో నిషాంతిని సివిల్ డ్రెస్ లో ఉన్నారు. ముచ్చటపడి దిగిన ఆ ఫొటోను రాజమాణిక్యం ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టారు. అయితే, అక్కడి ప్రముఖ వార్తాపత్రికలో ఆ ఫొటో ప్రచురితం కాగా, కొచ్చికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్ పై సర్కారుకు ఫిర్యాదు చేశారు. పోలీసు యూనిఫాంను జిల్లా కలెక్టర్ దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, రాజమాణిక్యానికి కాషన్ నోటీసు పంపిన ప్రభుత్వం, విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News