: చంద్రబాబును జైల్లో పెట్టాలి: జగన్


రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వీఐపీ ఘాట్ లో ఎందుకు పూజలు చేసుకోలేదని జగన్ ప్రశ్నించారు. కేవలం పబ్లిసిటీ కోసమే వీఐపీ ఘాట్ ను వదిలి వేరే ఘాట్ కు వచ్చి, తోపులాటకు కారణమయ్యారని ఆరోపించారు. చంద్రబాబు పూజలు జరుగుతున్నంత సేపు జనాలను ఘాట్ లోకి అనుమతించలేదని... ఆయన వెళ్లిపోయిన వెంటనే, ఒక్కసారిగా వదలడంతో, తొక్కిసలాట చోటు చేసుకుందని అన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం మానవత్వం ఉన్నా కాశీకి పోయి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. ఇంత మంది మృతికి కారణమైన చంద్రబాబును జైల్లో పెట్టాలని అన్నారు.

  • Loading...

More Telugu News