: పుష్కర ఘటన మృతుల కుటుంబాలకు బాలకృష్ణ సానుభూతి
రాజమండ్రి పుష్కర ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘాట్ల దగ్గర నియమ నిబంధనలను పాటించి సురక్షితంగా పుష్కర స్నానాలను ఆచరించాలని భక్తులకు ఆయన సూచించారు. సహాయక చర్యల్లో అభిమానులు పాల్గొనాలని ఈ సందర్భంగా బాలయ్య పిలుపునిచ్చారు.