: సండ్రకు బెయిల్ మంజూరు... ఏసీబీ కోర్టులోనే ఊరట లభించిన వైనం
ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా తెలంగాణ ఏసీబీ ఆరోపిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు సండ్రకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని సండ్ర దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ పై విచారణ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా, నిన్న వాదోపవాదాలు ముగిశాయి. తీర్పును నేటికి వాయిదా వేసిన కోర్టు న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితం సండ్రకు బెయిల్ మంజూరు చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో విచారణ కోర్టు పరిధిలోనే సండ్రకు బెయిల్ లభించినట్లైంది.