: 23కు చేరిన మృతుల సంఖ్య... ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు
రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి సంఖ్య 23కు పెరిగింది. మరో 32 మంది క్షతగాత్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసుపత్రికి చేరుకుని, గాయపడిన వారిని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. గాయపడిన వారితో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు.