: నాసిక్ లో ప్రారంభమైన కుంభమేళా... రాజ్ నాథ్, ఫడ్నవిస్ లు హాజరు
మహారాష్ట్రలోని నాసిక్ లో అత్యంత పవిత్రమైన కుంభమేళా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లు హాజరయ్యారు. నాసిక్ లో దేవేంద్ర ఫడ్నవిస్, త్రయంబకేశ్వర్ లో రాజ్ నాథ్ జెండాలను ఆవిష్కరించడం ద్వారా కుంభమేళాను ప్రారంభించారు. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. కుంభమేళాకు భారీ ఎత్తున భక్తులు, సాధువులు తరలి వస్తున్నారు. నాసిక్ లోని కుషావర్తం, రామ్ కుండ్ ల వద్ద భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు.