: తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ... రాజమండ్రిలో చంద్రబాబు, ధర్మపురిలో కేసీఆర్ పుష్కర స్నానం


తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కర శోభ సంతరించుకుంది. కొద్దిసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభమైన పుష్కరాల్లో భాగంగా తొలి రోజే స్నానమాచరించేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు గోదావరి తీరానికి తరలివచ్చారు. దీంతో గోదావరి తీరంలో భక్తజన సందోహం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. మరోవైపు కరీంనగర్ జిల్లా ధర్మపురి క్షేత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సతీసమేతంగా పుష్కర స్నానమాచరించారు. పది నిమిషాల తేడాతో ఇద్దరు సీఎంలు పుష్కర స్నానం చేస్తారని భావించినా, ఇద్దరూ ఒకే సమయానికి సరిగ్గా 6.31 నిమిషాలకు స్నానమాచరించారు.

  • Loading...

More Telugu News