: హ్యాకింగ్ కారణంగా నష్టమేమీ వాటిల్లలేదు: ఇస్రో చీఫ్


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పొరేషన్ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ పై చైనా హ్యాకర్లే దాడికి పాల్పడి ఉంటారని ఇస్రో వర్గాలు భావిస్తున్నాయి. కాగా, హ్యాకింగ్ అంశంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్ స్పందించారు. హ్యాకింగ్ కారణంగా ఎలాంటి సమాచార నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. యాంత్రిక్స్ వెబ్ సైట్ అండర్ కన్ స్ట్రక్షన్ లో ఉన్నందున దాంట్లోని సమాచారాన్నంతటినీ ఇస్రో వెబ్ సైట్ కు తరలించామని వివరించారు. అండర్ కన్ స్ట్రక్షన్ లో ఉన్న వెబ్ సైట్లే అధికంగా హ్యాకింగ్ బారిన పడుతుంటాయని అభిప్రాయపడ్డారు. యాంత్రిక్స్ సైట్ ను ముంబయికి చెందిన ఓ వెబ్ సైట్ ప్రొవైడర్ ఆధునికీకరణ చేస్తున్నట్టు తెలిపారు. యాంత్రిక్స్ వెబ్ సైట్ లోని సమాచారాన్ని ఇస్రో సర్వర్ కు తరలిస్తుండగా, హ్యాకింగ్ కు గురైందని అన్నారు. అందులో కీలక సమాచారం ఏమీ లేదని ఇస్రో వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News