: పవన్ ట్విట్టర్ వ్యాఖ్యలపై రఘువీరా స్పందన


ఏపీ ప్రత్యేక హోదాను కాంగ్రెస్ నేతలు గాలికొదిలేశారని, కేవలం లలిత్ మోదీ వివాదానికే ఆ పార్టీ పరిమితమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్విట్టర్ వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సంవత్సరం నుంచీ పోరాడుతోందని రఘువీరా చెప్పారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లేఖ కూడా రాశారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణుల కోటి సంతకాల సేకరణతో పాటు నిరసన తెలియజేస్తోందని అన్నారు. పవన్ కు ఈ సమాచారం తెలియకపోవడంవల్లే ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పోరాడాలని మాట్లాడారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News