: గవర్నర్ ను రక్షించాలంటూ ఎన్ హెచ్చార్సీలో ఆంధ్రా అసోసియేషన్ పిటిషన్


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘంలో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ పోలీసుల నుంచి గవర్నర్ ను కాపాడాలంటూ ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు వీరరాఘవరెడ్డి ఆ పిటిషన్ ను దాఖలు చేశారు. గవర్నర్ ను తెలంగాణ పోలీసులు నిర్బంధించారని, ఆయనను రక్షిస్తేనే రాజ్యాంగాన్ని కాపాడగలరని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు రక్షణ లేదని, సెక్షన్ 8ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆంధ్రా అసోసియేషన్ డిమాండ్ చేసింది. అంతేగాక మీడియా స్వేచ్ఛకు కూడా తెలంగాణలో రక్షణ లేదని వాపోయారు. ఇటు ఏబీఎన్ చానల్ పై నిషేధం విధించి సంవత్సరం గడిచినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని వివరించారు.

  • Loading...

More Telugu News