: సత్తా చాటుతున్న బంగ్లా క్రికెటర్లు... సఫారీలపై రికార్డు విక్టరీ!


మొన్న మేటి క్రికెటర్లున్న టీమిండియా... తాజాగా అన్ని రంగాల్లో బలీయ జట్టుగా పేరుగాంచిన దక్షిణాఫ్రికా... బంగ్లా క్రికెటర్ల ముందు తోకముడిచాయి. వరుస విజయాలతో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సత్తా చాటుటోంది. ఇటీవల జరిగిన సిరీస్ లో టీమిండియాను చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకున్న బంగ్లా జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నిన్న మిర్పూర్ లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్ లో బంగ్లా జట్టు జయకేతనం ఎగురవేసింది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ చేజార్చుకున్న బంగ్లా జట్టు సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే నిన్నటి రెండో వన్డేలో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. అదే కసితో రగిలిపోయిన బంగ్లా క్రికెటర్లు పటిష్ఠ సఫారీ జట్టును చిత్తు చేశారు. దక్షిణాఫ్రికాపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 46 ఓవర్లకే 162 పరుగులు చేసి చాప చుట్టేశారు. ఆ తర్వాత బంగ్లా బ్యాట్స్ మెన్ సౌమ్య సర్కార్ (88 నాటౌట్), మహ్మదుల్లా(50) అర్ధ శతకాలతో అదరగొట్టారు. దీంతో కేవలం 27.4 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి బంగ్లా జట్టు సఫారీలపై ఘన విజయం సాధించింది.

  • Loading...

More Telugu News