: రేపటి నుంచి మూడు రోజుల పాటు గుంటూరులో లోకేష్ మకాం


టీడీపీ యువనేత నారా లోకేష్ రేపటి నుంచి గుంటూరులో మకాం వేయబోతున్నారు. ఇక నుంచి ఏపీలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని ఆయన నిర్ణయించుకున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వారంలో మూడు రోజుల పాటు లోకేష్ అక్కడే ఉంటారని చెప్పారు. ముఖ్యంగా రేపు గుంటూరులోని పార్టీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించనున్నారని వివరించారు. రాష్ట్ర విభజనతో పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ రావడానికి ఇబ్బంది పడుతున్నారు. దాంతో గుంటూరు నగరంలోని టీడీపీ కార్యాలయాన్ని ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా మార్చాలని ఇప్పటికే పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. అందుకే ఏపీలో పార్టీ పనులు, ఇతరత్రా వాటిని ఇక్కడే ఉండి పరిశీలించాలని లోకేష్ నిశ్చయించుకున్నారు.

  • Loading...

More Telugu News